రుణం కోసం దరఖాస్తులు చేసుకోండి: ఎంపీడీవో

KDP: గృహ హక్కు పథకం అదనపు రుణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో పణి రాజకుమారి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన సిద్ధవటంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆమె తెలిపారు.