శ్రీశైలం ఎమ్మెల్యే వివాదంపై డిప్యూటీ సీఎం ఫైర్

NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అటవీ సిబ్బందిపై జరిగిన దాడిపై వెంటనే విచారణ జరిపించాలని బుధవారం ఆదేశించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.