వాగులో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

MLG: జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో ఆదివారం అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్ళిన సగలం గౌరమ్మ అనే మహిళ.. తుమ్మల వాగులో గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. మహిళ బయటకు వెళ్ళినప్పుడు ఎవరూ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని, వాగులో కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు.