VIDEO: జేసీబీ సహాయంతో చెత్త తొలగింపు

NTR: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు భారీగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ గుణదల వంతెనపై వర్షపు నీరు చేరిపోవటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. సుమారు అడుగున్నర మేర వంతెనపై వర్షపు నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బుధవారం స్థానికులు జేసీబీతో కూరుకు పోయిన చెత్త తొలిగించారు.