శ్రీకాకుళంలో మొదలైన చలి తీవ్రత
SKLM: శ్రీకాకుళంలో చలి విజృంభిస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల సమయం అయినా చలి తీవ్రత తగ్గడం లేదు. శ్రీకాకుళంలోని పలు పల్లె ప్రాంతాల్లో పొగ మంచు అలుముకుంది. ఈ క్రమంలో జిల్లాలోని రాత్రి సమయాల్లో 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది. డిసెంబర్ నెల దగ్గర కావస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.