ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని సన్మానించిన టీడీపీ నాయకులు
ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని టీడీపీ నాయకులు శనివారం కార్యాలయంలో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా ఏర్పడడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలో వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తారని తెలిపారు. మార్కాపురం జిల్లా సాధించడంలో ఆయన సఫలీకృతుడు కావడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.