బాలానగర్ కింద క్రీడా ప్రాంగణంగా ఓపెన్ స్పేస్
MDCL: బాలానగర్ వంతెన దిగువనున్న ఓపెన్ స్పేస్‌ను క్రీడా ప్రాంగణంగా వినియోగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి మరో ఏడాది పొడగింపునకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. యువతకు క్రీడా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ, శుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రాంగణాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.