VIDEO: పశుగ్రాసం సాగుపై పాడి రైతుల దృష్టి
WGL:రాయపర్తి మండలంలో పాడి రైతులు పశుగ్రాసం సాగు పై దృష్టి సారిస్తున్నారు. వేసవి కాలంలో పచ్చిగడ్డి లభ్యత తక్కువగా ఉండటంతో గేదెలు, ఆవులు పాలు సరిగా ఇవ్వడం లేదని, ఎండు గడ్డి మేయడం వల్ల పశువుల్లో క్యాల్షియం స్థాయిలు తగ్గి బలహీనత పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యుల సూచనల మేరకు రైతులు పశుగ్రాసం సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు.