'పాడైన రోడ్లను నిర్మించండి'

ELR: జంగారెడ్డిగూడెంలో పాడైన రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. జిలా నాయకులు రమణ మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గోతులమయంగా ఉందన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిని కూడా నిర్మించాలనీ ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.