MLA గూడెం మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు పడనుందా?

SRD: పార్టీ ఫిరాయించిన MLAలపై 3 నెలల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై అనర్హత వేటు పడనుందా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని BRS ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.