VIDEO: యూరియా వినియోగం పై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: తర్లుపాడులో తహసీల్దార్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా వాడకంపై ఇవాళ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో యూరియా కొరత లేదని, అలాగే యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.