VIDEO: పెనుమంట్రలో భారీ వర్షం
W.G: దిత్వా తుఫాన్ ప్రభావంతో పెనుమంట్ర మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండలంలో పలుచోట్ల వరి కోతలు ప్రారంభం కావడంతో కురుస్తున్న వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు.