VIDEO: రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవ దహనం
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం వద్ద టిప్పర్‌ను ఓ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అవ్వగా, 10 మంది సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.