వైరాలో గంజాయి పట్టివేత.. 101 కిలోలు స్వాధీనం!
KMM: ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక కారును ఆపి తనిఖీ చేయగా, అందులో 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్ లభ్యమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అస్లామ్ అనే వ్యక్తి ఒడిశా నుంచి HYDకి ఈ గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడు.