బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. కాగా, పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఇంజమామ్-ఉల్-హక్ (20,541) కొనసాగుతున్నాడు.