అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులతో కలిసి గురువారం ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. చారకొండ మండలం తుర్కలపల్లి, సారబండ తండా, అచ్చంపేట మండలంలోని అంకిరోనిపల్లి, మర్లపాడు తండా, చంద్రవాగుల్లో వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, అధికారులను అప్రమత్తం చేసి, అవసరమైన జాగ్రత్తల కోసం తగిన ఆదేశాలు ఇచ్చారు.