మలేషియాలో గ్రాండ్‌గా ఆడియో లాంఛ్: అనిరుధ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ ఈనెల 27న మలేషియాలో భారీ ఎత్తున జరగనుంది. అయితే, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో, ఆయన మర్చిపోలేని విధంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తామని అనిరుధ్ పేర్కొన్నాడు.