'రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాలి'

ప్రకాశం: ప్రతి ఎరువుల దుకాణాల్లో శాంపిల్ సేకరించి ల్యాబ్‌లోకి పంపిస్తామని, తద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందుతాయని క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని ఎరువు దుకాణాలపై సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించి, సేకరించిన శాంపిళ్లను విశాఖకు రీజనల్ కోడింగ్ సెంటరు తరలించడం జరిగిందని తెలిపారు.