'తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

AKP: తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తహసీల్దార్ అంబేడ్కర్ తెలిపారు. ఈనెల 19 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటల సిబ్బంది డ్యూటీలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రహదారులకు అడ్డంగా చెట్లు కూలినా, వాగులు, గెడ్డలు గట్లు తెగిన 89342 94438 సమాచారం తెలిపాలన్నారు.