VIDEO: కోతకు గురవుతున్న నూజివీడు రహదారి

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు వాగు ఉధృతికి మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జాతీయ రహదారి కోతకు గురవుతోంది. వాగు ప్రవాహం వేగంగా పెరగడంతో రహదారి పక్క భాగం దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో బుడమేరు ఉగ్రరూపం చూపి భారీ నష్టం కలిగించిన విషయం తెలిసిందే.