కాపర్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

కాపర్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

కృష్ణా: కృత్తివెన్ను మండలంలోని ఓఎన్జీసీ ప్లాంట్‌లో కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చెరుకుమిల్లి యూనిట్ నుంచి వైర్లు మాయమవ్వడంతో ఈ నెల 26న వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ దొంగతనంలో ఓఎన్జీసీలో స్క్రాప్ తరలించే లారీ క్లీనరే ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.