ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

MNCL: ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ శివారులో సదర్ మాట్ వద్ద గోదావరి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు పడడం, ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేయడంతో మేడంపల్లి సదర్ మాట్ కాల్వ వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అటువైపు ప్రజలు, పర్యాటకులు రావద్దని ఇరిగేషన్ అధికారులు సూచించారు.