వినుకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన MLA జీవి

PLD: వినుకొండ 12వ వార్డులోని అంబేడ్కర్ కాలనీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఈ కార్డులను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.