గుంటూరు కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్
GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.