వందేమాతరం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మ: కలెక్టర్

వందేమాతరం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మ: కలెక్టర్

ADB: జాతీయ గేయం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని అధికారులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేమాతరం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆత్మలాంటిదని పేర్కొన్నారు.