VIDEO: బిల్లు రాలేదని పాఠశాలకు తాళం

VIDEO: బిల్లు రాలేదని పాఠశాలకు తాళం

MNCL: చేసిన పనికి బిల్లు రాలేదని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేసిన ఘటన తాండూరు మండలంలో చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ కొమురయ్య కథనం ప్రకారం.. 2023లో మన ఊరు-మన బడిలో భాగంగా రూ.12 లక్షల ఖర్చు చేసి డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, బాత్ రూమ్, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు రూ.6 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన బిల్లు రాకపోవడంతో పాఠశాలకు తాళం వేశామన్నారు.