సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
పెద్దపల్లి: మండలంలోని కాసులపల్లి గ్రామంలో సోమవారం ఈజీఎస్ నుంచి రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ గద్దల రాజశేఖర్ ప్రారంభించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.