'విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ'

NRPT: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని నారాయణపేటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వోత్తులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.