VIDEO: ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కృష్ణారెడ్డి
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని కొత్త రాయపర్తి గ్రామంలో సెర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. మధ్య దళారులను ఆశ్రయించవద్దని హితవు పలికారు.