ఉపాధి శిక్షణా సంస్థను ప్రారంభించిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లెలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (CBRSETI)ను జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించడంలో శిక్షణా కేంద్రాలు కీలకమని, గ్రామీణ అభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయని తెలిపారు.