రేపు HYDకు రానున్న రాహుల్ గాంధీ
HYD: ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ నగరానికి రానున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఆయన ఉప్పల్‌లో సీఎం రేవంత్‌తో రేపు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రానున్నారు. కాగా, అధికారులు స్టేడియం వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.