మంత్రికి జర్నలిస్టులు వినతిపత్రం

మంత్రికి జర్నలిస్టులు వినతిపత్రం

WGL: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు వరంగల్ తూర్పు జర్నలిస్టులు కలిశారు. దేశాయిపేటలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గత, ప్రస్తుత ప్రభుత్వాలు తెలిపాయని వారు మంత్రికి గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సాధనకై తాము 2 వారాలుగా నిరసన చేస్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. ఇళ్లు ఇవ్వాలని వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు.