ఎంపీ కేశినేనిని కలిసిన ఎమ్మెల్యే శిరీష

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను బహుకరించారు.