VIDEO: గుంతలు పూడ్చిన స్థానిక ప్రజలు
SRPT: నూతనకల్ మండల కేంద్రం నుంచి చిప్పలకుంట్ల వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు రంగంలోకి దిగారు. శుక్రవారం వారు జేఏసీ సహాయంతో గుంతలను పూడ్చారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.