మహేష్ బాబు జన్మదిన వేడుకలు

HYD: సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలను నాచారంలో ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు అభిమాని మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారంలోని సాధన మానసిక దివ్యాంగుల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. అక్కడ దివ్యాంగులకు స్కిల్ కిట్స్ అందించడమే కాకుండా దివ్యాంగులతో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.