సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణ పనులు వేగవంతం

సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణ పనులు వేగవంతం

JGL: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో నిర్మిస్తున్న సైన్స్‌ల్యాబ్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సైన్స్‌ల్యాబ్ నిర్మాణ పనుల కోసం రూ. 13.50 లక్షలను మంజూరు చేయించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, నాయకులు ఎమ్మెల్యే‌కు కృతజ్ఞతలు తెలిపారు.