ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి: కలెక్టర్

WNP: కేంద్రాలలో కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలను పంపించాలని, అలసత్వంవహిస్తే కాంట్రాక్టు అనుమతి రద్దుచేస్తామని హెచ్చరించారు.