వైకుంఠ సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ మాతృమూర్తి వైకుంఠ సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.