1500 సిబ్బందితో 5 అంచెల భద్రత: ఎస్పీ
SRPT: మొదటి విడత ఎన్నికలు జరగనున్న 8మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందని ఎస్పీ నరసింహా తెలిపారు. 1500 మంది సిబ్బందితో 5 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ప్రలోభాలు, తప్పుడు సమాచారం, సోషల్ మీడియా దుర్వినియోగం, గుంపులుగా చెరడం నిషేధమని హెచ్చరించారు. కేంద్రాల్లో సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచామని తెలిపారు.