రెండో రోజూ జిల్లాలో సర్పంచ్‌కు 176 నామినేషన్లు
BHNG: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. రెండో రోజు సర్పంచ్ పదవి కోసం 176 నామినేషన్లు దాఖలయ్యాయి. తుర్కపల్లి మండలంలో అత్యధికంగా 96 పత్రాలు స్వీకరించారు. ఆలేరులో 40, రాజాపేటలో 56, యాదగిరిగుట్టలో 60, ఆత్మకూరు(M)లో 78, బొమ్మలరామారంలో 67 నామినేషన్లు వచ్చాయి.