ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

CTR: పుంగనూరు పట్టణం లినార్డ్ మున్సిపల్ హైస్కూల్లో ఆదివారం వారాహి గ్రూప్స్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు శిబిరానికి వచ్చారు. బెంగళూరుకు చెందిన వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య నిపుణులు శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.