హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. వినుకొండ మండలం, అందుగుల కొత్తపాలెం వద్ద రూ. 15.83 కోట్లతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను సందర్శించారు .బ్రిడ్జి పూర్తయితే స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు, వర్షాకాల ఇబ్బందులు తొలగుతాయని అన్నారు.