వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన అదనపు కలెక్టర్
HNK: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ రవి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలను మిల్లులకు ట్యాగింగ్ చేసి జాబితా సిద్ధం చేయాలని, FAQ ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరణ జరగాలని సూచించారు. రవాణా సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.