నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన నాయకులు

KMR: దేవునిపల్లిలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డు మంజూరు పత్రాలను పార్టీలకతీతంగా నాయకులు లబ్ధిదారులకు గురువారం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యానికై వేలాది మంది ప్రజలు నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూశారని, ప్రస్తుతం వారి ఆశలు నెరవేరాయన్నారు.