కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
BDK: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన దేశానికే మార్గదర్శకుడని కలెక్టర్ అంకిత్ కొనియాడారు. సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పడంలో ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.