కోసిగిలో అన్న క్యాంటీన్ ప్రారంభం
KRNL: కోసిగి పట్టణంలో రూ.5కే భోజనం అందించే అన్న క్యాంటీన్‌ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.