రేషన్ పంపిణీ పకడ్బందీగా చేయాలి: సబ్ కలెక్టర్

KRNL: ఆదోనిలోని అంబేద్కర్ నగర్‌లోని షాప్ నెంబర్ - 62 చౌక ధరల దుకాణంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదివారం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. కార్డుదారులకు రేషన్ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో తహశీల్దార్ శివరాముడు ఉన్నారు.