'ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
PPM: నందివానివలస పరిసరాల్లోని తామర చెరువు వద్ద శుక్రవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉంటూ పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఏనుగులకు దగ్గరగా వెళ్లొద్దని సూచించారు. అవి కనిపిస్తే ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు.