VIDEO: పాప కిడ్నాప్.. తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ

ప్రకాశం: సింగరాయకొండకు చెందిన చిలకూరి హరికృష్ణ కుమార్తె మూడేళ్ల ఐశ్వర్య సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియనివ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ హాజరత్తయ్య, ఎస్సై మహేంద్రలు తమ సిబ్బందితో గాలించారు. వలేటివారిపాలెంలో ఆ పాప ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. శనివారం ఎస్పీ దామోదర్ ఆబాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.