రూ.32,316 కోట్లతో అమరావతి మొదటి దశ పనులు
GNTR: అమరావతి మొదటి ఫేజ్ 2029కి పూర్తయ్యేలా ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. దీని కోసం రూ.32,316 కోట్లకు పైగా అవసరమని అంచనా వేసింది. గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు రూ.10,171 కోట్లు, ప్రాథమిక వసతులకు రూ.8,845 కోట్లు, శాశ్వత మౌలిక సదుపాయాలకు రూ.10,949 కోట్లు ఖర్చు చేస్తోంది. WB, ADB రుణం అందించగా కేంద్రం, ఇతర ఆర్థిక సంస్థల నుంచి మిగిలిన నిధుల్నిసేకరిస్తున్నట్లు APCRDA తెలిపింది.